ఆచార్యులగూడెంలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ
Mbmtelugunews// చిలుకూరు, సెప్టెంబర్3 (ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని ఆచార్యుల గూడెం గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ పెద్దలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



