చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
Mbmtelugunews//సూర్యాపేట, సెప్టెంబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్): టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 10న హైదరాబాదులో లక్ష మందితో జరగబోయే ఉద్యోగుల సమస్యల సాధన సభ విజయవంతం చేయడంలో భాగంగా రూపొందించిన వాల్ పోస్టర్ ను తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ సూర్యపేట జిల్లా ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు దున్న శ్యామ్, తంగెళ్ల జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే ఉద్యోగుల సాధన సభను సూర్యపేట జిల్లా నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉద్యోగుల అధికారులను అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల సమస్యలన్నిటిని పరిష్కరించడంలో భాగంగా రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలు ఎన్నింటిని పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు రేపాక లింగయ్య, నాయిని ఆకాష్ వర్మ, డా, బట్టు గోపి, జి వెంకటయ్య, బి శ్రీనాథ్, వలిగొండ కృష్ణ, కొంపల్లి మాత్యగిరి, ఎం సైదులు, రాంపల్లి శ్రీను, దాసరి వెంకన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.



