ప్రజల కోసం పుట్టిన నాయకత్వం… యువతకు ఒక స్ఫూర్తి… అదే మన చైతన్య!
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్): గిరిజన ప్రాంతం నేల నుంచి మొదలైన చైతన్య ప్రయాణం చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి,
ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, మున్సిపాలిటీ 7 వ వార్డ్ ప్రజా ప్రతినిధిగా ఎదిగిన నీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. పదవి కోసం కాదు… ప్రజల కోసం, పేరు కోసం కాదు… సేవ కోసం, అధికారం కోసం కాదు… అభివృద్ధి కోసం
నడిచే నీ ఆలోచనలకు మరింత బలం రావాలి. నాకు తమ్ముడిగా ప్రేమను పంచుతూ, మంచి స్నేహితుడిగా అండగా నిలుస్తూ, బాధ్యత గల పౌరుడిగా సమాజం కోసం ఆలోచిస్తూ,
చదువుకున్న యువ నాయకుడిగా భవిష్యత్తును నిర్మిస్తూ,
మంచి కొడుకుగా కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తున్న నీకు నీ నాయకత్వం మరింత బలపడాలి…నీ స్వరం ప్రజల గొంతుక కావాలి…నీ అడుగులు అభివృద్ధికి బాటలు వేయాలి…నీ సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి! నీ జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది కావాలి. ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని విజయాలు సాధించి, మరింత ఉన్నతమైన ప్రజా పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు నీ అభిమాని
…నరేంద్రుడు



