Thursday, September 10, 2026
[t4b-ticker]

దళిత ముఖ్యమంత్రి దళితలకు మూడెకరాలు

దళిత ముఖ్యమంత్రి దళితలకు మూడెకరాలు

:దళిత బంధు ఇస్తానని దళితులను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారు.

:అసెంబ్లీ స్పీకర్ పైన అసభ్యకరంగా మాట్లాడిన తాత మధు పదవి నుండి తొలగించాలి.

: మహిళ పోలీసుల పైన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల దాడి బాధ్యత రహితం.

:కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు తాత మధు ల దిష్టిబొమ్మ దగ్ధం.

:కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్.

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్):దళిత ముఖ్యమంత్రి, దళితలకు మూడెకరాలు,దళిత బంధు ఇస్తానని దళితులను మోసం చేసిన కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పారని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్ అన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడిన తీరు బాధాకరమని మధును వెంటనే పదవిని బర్తరఫ్ చేయాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తాత మధుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కెసిఆర్ తన ఎమ్మెల్యేలకు కొడుకుకి అధికారం పోయిన దగ్గర నుండి అహంకారం పెరిగి ఎవరితో ఎట్ల మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాక వాళ్ల వ్యవహార శైలి బాధ్యతరహితంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీని నాయకులను విమర్శిస్తూ గతలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దోచుకున్న సంగతి ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో గతంలో ప్రజలకు అన్నీ తెలుసు అన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని ప్రజల సొమ్మును దోచుకుని ప్రజలను అప్పు ల ఊబిలోకి నెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన కెసిఆర్ దళిత స్పీకర్ కి దండం పెట్టాల్సి వస్తుందని నెల నెల జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాడని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరు మీద దళిత బంధు, గొర్రెల పంపిణీ, లిక్కర్, ఉద్యోగాలు అమ్ముకొని మట్టి దందా, బియ్యం దందాలు, ఉష్కా ల్యాండ్ మాఫియా చేసి లక్షల కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో ఆస్తులు సంపాదించుకున్న కేసీఆర్ కుటుంబం
అధికారం లో కి వస్తే దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, దళిత బందు, ఎస్సీ రిజర్వేషన్లు కల్పిస్తారని ఇచ్చిన హామీలు నెరవేర్చని కేసీఆర్ దళితులను మోసం చేశాడన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కాసర్ల కోటయ్య, తమనబోయిన వీరబాబు, చింతకుంట్ల సూర్యం, మణెమ్మ, రేపాని శ్రీను, మల్లు వెంకట్ రెడ్డి, గునుగుంట్ల శ్రీనివాస్, పోలంపల్లి వేంకటేశ్వర్లు, దొంగరి నాగవేణు తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular