కూలీలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేయాలి : సర్పంచి దున్నా శ్రీనివాస్.
Mbmtelugunews//నడిగూడెం 11(ప్రతినిధి మాతంగి సురేష్):విబిజీ రాంజీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు 125 రోజులు పనులు కల్పించే విధంగా గ్రామసభ ద్వారా గుర్తించిన పనులను మంజూరు చేయాలని గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ అధికారులను కోరారు. శుక్రవారం నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఉపాధి హామీ పనుల గుర్తింపు పై నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతంలోని కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉపాది హామీ పనులు నిరంతరం జరిగే విధంగా ప్రణాళికల సిద్ధం చేయాలని కోరారు. అన్ని రంగాల్లో గ్రామాభివృద్ధి చేసుకొనేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, వార్డు సభ్యులు దున్నా లింగయ్య, దున్నా మనిషా ప్రదీప్, పోలేబోయిన విజయ నాగరాజు, నాగారపు సరస్వతి రాము, కాసాని మాధవి గోపీనాథ్, షేక్ నజియా రియాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, మాజీ సర్పంచ్ చెల్లంచర్ల సత్యనారాయణ నాయకులు కాసాని వెంకన్న షేక్ లతీఫ్ బాబు, షేక్ జలీల్,పెరుగు ఉపేందర్,దున్న అర్జున్, గుండు విజయ రామారావు, అల్తాఫ్ హుస్సేన్, శ్రీరాముల శేషయ్య, శ్రీరాముల శ్రీనివాస్, రాధా, రాములమ్మ, లక్ష్మి, రేణుక పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



