Saturday, September 12, 2026
[t4b-ticker]

యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు….. కోదాడలో కొలువుల జాతర….

యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు….. కోదాడలో కొలువుల జాతర….

:జాబ్ మేళాలో పాల్గొననున్న 200–250 కంపెనీలు..

:వేలాది ఉద్యోగ అవకాశాలు.. ఈ నెల 19న మెగా జాబ్‌మేళాలో …….

:యువత చేతికి కొలువు.. కోదాడ గడ్డపై మెగా ఉద్యోగ మేళా…..

:నిరుద్యోగ యువతకు నయా దారి.. కోదాడలో ఈ నెల 19న ఉద్యోగాల పండుగ….

:ఇలాంటి జాబు మేళాలు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికి ఉపయోగపడతాయి.

:కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణా రావు.

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నెల 19న కోదాడ పట్టణంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల కృష్ణారావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో భారీ స్థాయిలో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలను హాజరవుతున్నాయని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ విద్యార్హతలు కలిగిన వారితో పాటు అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీల ప్రతినిధులతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాబ్‌మేళాకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. కోదాడ పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా వివరాలను విస్తృతంగా చేరవేసి, అధిక సంఖ్యలో యువత పాల్గొనేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో అందుతున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని అన్నారు. ఇలాంటి జాబు మేళాలు నిరుద్యోగ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఎంతో ఉపయోగపడతాయని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు అన్నారు. కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular