ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన వారు… ఉద్యోగాలు కల్పిస్తున్న వారిని విమర్శించడం విడ్డూరం!
:ముందు మీ హయాంలో ఉద్యోగాల లెక్క చెప్పండి…ఆ తర్వాత జాబ్ మేళాపై మాట్లాడండి!
:జాబ్ మేళాను విమర్శించే హక్కు ఎవరికుంది?
:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు యాదవ్.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 16(ప్రతినిధి మాతంగి సురేష్): 19వ తేదీన కోదాడలో జరగనున్న మెగా జాబ్ మేళాపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న విమర్శలు అర్థరహితం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎందుకు? యువతకు ఉద్యోగాలు రావడం మీకు ఇష్టం లేదా? లేక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పని కనిపించడం లేదా?అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువత కోసం మీరు ఎన్ని జాబ్ మేళాలు నిర్వహించారు? ఎన్ని కంపెనీలను తీసుకొచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు? ముందు ఆ లెక్క చెప్పండి… ఆ తర్వాత జాబ్ మేళాపై మాట్లాడండి. అధికారంలో ఉన్నప్పుడు యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయి, ఇప్పుడు ఇతరులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడం రాజకీయ కపటత్వం కాదా?విమర్శలతో ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం రాదు. కంపెనీలను తీసుకురండి… ఉద్యోగాలు ఇప్పించండి… అప్పుడు మీ మాటకు విలువ ఉంటుంది.
19వ తేదీ జాబ్ మేళా రాజకీయ సభ కాదు.. నిరుద్యోగ యువత జీవితాల్లో మార్పు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం. దానిపై రాజకీయ బురదజల్లడం మానుకోవాలి. మాటలు చెప్పడం కాదు… పని చేసి చూపించాలి.
విమర్శలు చేయడం కాదు… ఉద్యోగాలు ఇప్పించాలి.
అడ్డుకోవడం కాదు… యువతకు అండగా నిలవాలి. కోదాడ యువతకు మా స్పష్టమైన సందేశం ఒక్కటే.. మీ భవిష్యత్తు కోసం వచ్చే ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ మేళాను అడ్డుకోవడం కాదు…మీకు చేతనైతే ఉద్యోగాలు చూపించండి!



