Wednesday, September 23, 2026
[t4b-ticker]

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగాన్ని అడుగడుగునా క్షోభకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగాన్ని అడుగడుగునా క్షోభకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్

:ఉత్తుత్తి మాటలతోనే పబ్బం గడుపుకొని తన స్వార్ధ రాజకీయాల కోసం మాత్రమే సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని క్షోభకు గురిచేస్తూ సంక్షోభంలోకి నెట్టేస్తున్న ఉత్తమ్.

:బూటకపు మాటలతో అవినీతి అబద్ధాల కార్యక్రమాలతోనే కాలం వెళ్లబుచ్చుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి..

:సైనికుడ్ని అని చెప్పుకునే నువ్వు ఈ కర్షకుడిని కాపాడలేని నీ పదవికి రాజీనామా చేయాలి.

:నీళ్లు లేని కాలువల పేరు మీద కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.

:చెవులు ఉండి వినలేక కళ్ళుండి చూడలేక కబోది లెక్క వ్యవహరిస్తూ రైతాంగాన్ని అప్పుల సంక్షోభంలోకి నెట్టేస్తున్న ఘనత కాంగ్రెస్ నాయకులది.

:రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వనందుకుగాను మునగాల 33 కేవీ సబ్ స్టేషన్ ముట్టడి, 65వ జాతీయ రహదారి దిగ్బంధం.

:వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం అందజేత.

:మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): నియోజకవర్గ పరిధిలోని రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం మునగాల మండల కేంద్రంలో భారీ ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆగ్రహించిన రైతులు 33 కేవీ సబ్ స్టేషన్‌ను ముట్టడించడంతో పాటు, 65వ నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని నినదిస్తూ, చెవిటి, మూగ ప్రభుత్వానికి ప్రతీకగా ఒక దున్నపోతుకు వినతిపత్రం అందించి తమ నిరసనను వినూత్నంగా వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని రేవంత్ రెడ్డి సర్కారు, నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగడుగునా క్షోభకు గురిచేస్తున్నారని, ఇందుకు వారు ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

బొగ్గు, నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ రైతులకు కరెంటు ఇవ్వలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు.సాగర్ డ్యామ్‌లో సరిపడా నీళ్లు ఉండి, కాలువల ద్వారా రైతుల చెరువులు నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. అవినీతికి అలవాటు పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తుత్తి మాటలతో కాలాన్ని వెళ్లదీస్తూ, తన స్వార్థ రాజకీయాల కోసమే సాగర్ ఆయకట్టు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. గత జూన్ 25వ తేదీన సాగర్ నుంచి నీళ్లు వదిలినప్పుడు చెరువులు నింపాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, సాగర్ ఆయకట్టు రైతాంగానికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు రైతుల పక్షాన నిలబడి రాస్తారోకోలు చేసి, రాజీనామాలకు డిమాండ్ చేసిన తరుణంలో రెండో విడతలో నీరు వదిలారని తెలిపారు. అయితే, ఆ నీటిని కూడా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని సాగర్ ఆయకట్టు ప్రాంతాలకు ఇవ్వకుండా, కేవలం తన రాజకీయ అవసరాల కోసం పక్క జిల్లాలోని పాలేరుకు తరలించారని తీవ్రంగా మండిపడ్డారు. నీళ్లు లేని కాలువలపై, లిఫ్ట్‌ల పేరుతో కోట్లాది రూపాయల కుంభకోణాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్పడుతున్నారని, రైతుల పొలాలు ఎండిపోతుంటే ఆయనకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన జాబ్ మేళా పేరుతో, హెలికాప్టర్లను షేర్ ఆటోల్లాగా వాడుకుంటూ సగం క్యాబినెట్‌ను తీసుకొచ్చి విహార యాత్రలు, ప్రదర్శనలు చేశారే తప్ప, కరెంటు, నీళ్లు లేక అల్లాడుతున్న రైతుల గోడు వినలేదని దుయ్యబట్టారు. పశువులు తాగడానికి, గ్రామాల్లో ప్రజలు తాగడానికి కూడా నీళ్లు లేక విలవిలలాడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే ఉన్న వ్యవసాయాన్ని కాపాడుకోలేక, రైతులు అప్పుల పాలవుతూ, కిరాయికి జనరేటర్లు తెచ్చుకుని వేలాది రూపాయల డీజిల్ పోసుకుని పంటలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. చెవులుండి వినలేని, కళ్లుండి చూడలేని ‘ఖబోది’ లెక్క వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకులు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. సాగర్ డ్యామ్‌లో నీళ్లు ఉన్నా రైతులకు ఇవ్వనని, అది తన ‘తాత జాగీరు’ అన్నట్లుగా మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని, అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.. తానొక సైనికుడినని పదే పదే చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నిజంగా దేశంపై, కర్షకులపై చిత్తశుద్ధి ఉంటే తన చేతకానితనానికి బాధ్యత వహిస్తూ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన అధికారాన్ని విహార యాత్రల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. నీచ చరిత్ర, అవినీతి మరకలు ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే ముక్కు నేలకు రాసి, రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అలాగే తక్షణమే 24 గంటల కరెంటు, సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular