Tuesday, September 29, 2026
[t4b-ticker]

115 మంది లబ్ధిదారులకు రూ.48.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

115 మంది లబ్ధిదారులకు రూ.48.56 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ.

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోదాడ నియోజకవర్గంలోని మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూడు మండలాలకు చెందిన 115 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.48,56,650 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు.

మండలాల వారీగా వివరాలు:

మోతె మండలం: 41 చెక్కులు – రూ.17,06,550, మునగాల మండలం: 34 చెక్కులు – రూ.14,20,500, నడిగూడెం మండలం: 40 చెక్కులు – రూ.17,29,600, మొత్తంగా 115 చెక్కులు – రూ.48,56,650 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular