శ్మశాన వాటికకు సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని పాత గుడిబండ శ్మశాన వాటికకు వెళ్లే దారిలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.2 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ ఖజానా సారథ్యంలో, గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ సర్పంచి మందుల నాగయ్య సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచి మందుల నాగయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన పనులను చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారం, ఆశీస్సులతో భవిష్యత్తులోనూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ జయసింహారెడ్డి, గ్రామ పెద్దలు ఇర్లా నరసింహారెడ్డి, కుక్కడపు సైదులు, వార్డు సభ్యులు సక్రు, దారా అఖిల, ఎరమళ్ల రోజా, చుక్క సుహాసిని, కుక్కడపు ఖాజా, పులి అనిత, ఎరగాని నాగశేషు గౌడ్, రాజుల లింగయ్య, ఫీల్డ్ ఆఫీసర్ భిక్షం, దారా ప్రేమ్ కుమార్, కాలితిరిపి పవన్, కాంట్రాక్టర్ నరేష్, కామాటి సూరయ్య, బాలేబైన తిరుమలి తదితర గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.



