గుడిబండలో అంగన్వాడీ ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశం
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 12( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి అంగన్వాడీ ఆరోగ్య లక్ష్మి కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచి మందుల నాగయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రతి ఒక్క చిన్నారికి వారి ఆరోగ్య పరిస్థితి, శారీరక దృఢత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కేటాయించిన పోషకాహారాన్ని సక్రమంగా అందించాలని సూచించారు. అలాగే పిల్లలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా పెంచడంతో పాటు వారికి ప్రతిరోజూ నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్వాడీ టీచర్లకు తెలిపారు. నేటి బాలలే రేపటి దేశ పౌరులు అనే ఉద్దేశంతో చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సర్పంచి మందుల నాగయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, రిటైర్డ్ టీచర్ ఇటిగల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్లు షేక్ నసీమా, ఉలి జానమ్మ, పులి నాగమణి, కాలె తిరుపతి, హేమలత, తల్లులు, పిల్లలు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



