జయంత్ & ది జింగో పిన్ సినిమాను విజయవంతం చేయండి
:విద్యార్థుల ను ఒత్తిడి తట్టుకునే చిత్రం
: పెరిక హాస్టల్ అధ్యక్షులు డా, హెచ్ రాజేష్, ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు..
కోదాడ, నవంబర్ 13(ప్రతినిధి మాతంగి సురేష్) నేడు బాలల దినోత్సవం సందర్భంగా విడుదల కానున్న ‘జయంత్ & ది జింగో పిన్’ సినిమా ఘన విజయం సాధించాలని కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షులు రాజేష్, ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిక సామాజిక వర్గానికి చెందిన బొలిశెట్టి ప్రవీణ్ కుటుంబం నుంచి వెండితెరకు అందిస్తున్న ఈ మంచి ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ చిత్రానికి బొలిశెట్టి దివ్యా ప్రవీణ్ నిర్మాతగా వ్యవహరించగా, బొలిశెట్టి ప్రవీణ్ సహకారంతో రూపొందిన ఈ సినిమా నేటి సమాజంలోని విద్యార్థుల ఒత్తిడులు , ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య చోటుచేసుకుంటున్న పరిస్థితులు, వాటి ప్రభావాలను ప్రతిబింబించేలా సందేశాత్మకంగా తెరకెక్కిందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి బాల నటుడు మాస్టర్ జయంత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారని తెలిపారు. ఇతర నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించారని పేర్కొన్నారు. మంచి కథాబలంతో, సామాజిక అంశాలను స్పృశిస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలవుతున్న ఈ సినిమా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమని అన్నారు. వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. నవంబర్ 14న విడుదల కానున్న ‘జయంత్ & ది జింగో పిన్’ సినిమాను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి వీక్షించాలని, ప్రతి ఒక్కరూ సినిమాను ఆదరించి ఘన విజయం సాధించేలా సహకరించాలని కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షులు రాజేష్, ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు, పెఱిక సంఘ నాయకులు చిత్తలూరి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు కృష్ణ, కందుల చంద్రశేఖర్, తీపిరిశెట్టి సుశీల రాజు, బొలిశెట్టి కృష్ణయ్య, తొగరు రమేష్, సూర్యాపేట జిల్లా పెరిక సంఘం ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకట్ నారాయణ, గౌరవాధ్యక్షులు రామినేని సత్యనారాయణ, బొలిశెట్టి నాగేంద్రబాబు, కోదాడ పట్టణ అధ్యక్షులు పత్తిపాక కృష్ణ, కార్యదర్శి బుడిగం నరేష్, దొంగరి శ్రీనివాస్ పాయిలి కోటేశ్వరరావు, పత్తిపాక జనార్ధన్, బచ్చు అశోక్, ముత్తినేని కోటేశ్వరరావు, జయరామయ్య, బొలిశెట్టి వెంకటేశ్వర్లు, గుండు అనురాధ, శ్రీరామ్ రోహిణి, తీపిరిశెట్టి సుశీల, మేకల జ్యోతి, అడ్వకేట్ దుర్గ, వనం నాగేశ్వరరావు, గుండు మధు, సాదే లక్ష్మీనారాయణ, బాదే రాము, మేకల వెంకటేశ్వర్లు, బత్తిని కృష్ణమూర్తి, బచ్చు శ్రీనివాస్, చిత్తలూరి శివయ్య, బుడిగం కిరణ, కిషోర్, శ్రీనివాస్, కీత శ్రీనివాస్ తదితరులు సినిమా విజయవంతం చేయాలని కోరారు.



