వీబీజీ రామ్ జి పనులను పరిశీలించిన ఎంపీడీవో
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 26(ప్రతినిధి మాతంగి సురేష్ ): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో వీబీజీ రామ్ జి పనులను సర్పంచి మందుల నాగయ్యతో కలిసి పరిశీలించిన ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్..ఈ సందర్భంగా ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్ మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పనులకు సంబంధించి కూలీలకు కేటాయించిన విధంగా పనులను సక్రమంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన పని పరికరాలను వెంట తీసుకురావాలని సూచించారు. అలాగే కూలీల సంఖ్యకు అనుగుణంగా పనులను ప్రణాళికాబద్ధంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ వైస్ ప్రెసిడెంట్ జయసింహారెడ్డి, గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి, గ్రామ కూలీలు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.



