Wednesday, April 22, 2026
[t4b-ticker]

ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సర్పంచ్ దున్నా శ్రీనివాస్

ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సర్పంచ్ దున్నా శ్రీనివాస్.

Mbmtelugunews//కోదాడ/(నడిగూడెం)ఏప్రిల్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):విద్యార్థుల ఆరోగ్యం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని సర్పంచ్ దున్నా శ్రీనివాస్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలోని స్థానిక గురుకుల పాఠశాల హాస్టల్లో,ఎస్సీ బాలుర హాస్టల్లో నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం లో దోమల మందు నివారణ కొరకు ఆల్ఫా సైపర్ మైత్రిన్ దోమల మందు ను పిచికారి చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దోమల వల్ల అనేక విష జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున దానికి దోమల నివారణ ఒక్కటే మార్గమన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పాఠశాల, హాస్టల్ పరిసరాలలో దోమల మందు పిచికారి చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామాల్లో పారిశుధ్య పనుల కొరకు ప్రత్యేక చోరవ తీసుకుంటుందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల సహకారంతో గ్రామాల్లో పారిశుధ్య పనులలో సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి, సబ్ యూనిట్ ఆఫీసర్ సురేందర్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ అమర్, పల్లె దావకాన డాక్టర్ హరినాథ్, పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, ఆశా కార్యకర్తలు సైదమ్మ, లక్ష్మి, సునీత, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular