ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
:మనిషి అవయవాలలో కన్ను ఎంతో ముఖ్యం
: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//కోదాడ/ నడిగూడెం ఏప్రిల్ 30 (ప్రతినిధి మాతంగి సురేష్): ఖమ్మం శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి గోసుల రాజేష్ అన్నారు. మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో ఖమ్మం శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచి గోసుల రాజేష్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి కంటి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ఉచితంగా కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు 100 మందికి పైగాచేశారు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది అత్యవసరంగా పదిమందికి ఆపరేషన్ అవసరమైనందున వారికి రేపు ఖమ్మం లో ఫ్రీగా ఆపరేషన్ చేయబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మాక్స్ విజన్ హాస్పిటల్స్ సిబ్బంది అసిస్టెంట్ డాక్టర్ క్యాంపు కోఆర్డినేటర్ దేవేందర్, శ్రీకాంత్, పాషా తదితరులు పాల్గొన్నారు.



