Thursday, July 30, 2026
[t4b-ticker]

గ్రామంలో సమస్యలను కలిసికట్టుగా పరిష్కరిద్దాం

గ్రామంలో సమస్యలను కలిసికట్టుగా పరిష్కరిద్దాం

: సర్పంచి పాలకి సురేష్

Mbmtelugunews//కోదాడ, జులై 30(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో మహిళా గ్రామసభ నిర్వహించారు. ఇటు సమావేశంలో గ్రామ సర్పంచి పాలకి సురేష్ మాట్లాడుతూ మన గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్య, ఆరోగ్యం, మహిళల భద్రత వంటి అంశాలపై మీ అందరి అభిప్రాయాలు, సూచనలు ఎంతో విలువైనవి. మీ సమస్యలను నిర్భయంగా ఈ సభలో చెప్పండి. వాటిని గ్రామపంచాయతీ తరఫున పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తాం.
ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రతి అర్హురాలికి చేరేలా అందరం కలిసి పని చేద్దాం అని అన్నారు. అలాగే ప్రతి మహిళ స్వయం ఉపాధి, పొదుపు, పిల్లల విద్య, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచి పత్తిపాక రమాదేవి, వార్డ్ మెంబర్ పాలడుగు జాన్, సంఘ బంధం సభ్యులు షకీరా, నీలవేణి, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular