Monday, April 20, 2026
[t4b-ticker]

ఘనంగా అగ్నిమాపక ముగింపు వారోత్సవాలు

ఘనంగా అగ్నిమాపక ముగింపు వారోత్సవాలు

:అగ్నిమాపక సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.

:వేసవికాలంలో అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి

:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 20(ప్రతినిధి మాతంగి సురేష్): వేసవికాలంలో అగ్ని ప్రమాదాల పట్ల కంపెనీలు, ఫ్యాక్టరీలు, మాల్స్, థియేటర్స్, అపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిద్దని తెలిసిన జరుగుతున్న తక్షణమే 101 కాల్ చేయాలని స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి అన్నారు. స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక ముగింపు వారోత్సవాలను ఎస్ ఎఫ్ ఓ కే డాక్టర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వై కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గతంలో అగ్నిమాపక శాఖ వారు కేవలం అగ్ని ప్రమాదాలకే పరిమితం అయ్యేవాళ్ళు కానీ వారు ఇప్పుడు సాహసోపేతమైన ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే నీళ్లలో వ్యక్తి పడినప్పుడు అతడిని కాపాడటం వంటి సాసోపేతమైన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

మన ఇంటి పరిసర ప్రాంతాలలో పురాతనమైన అవసరం లేని వస్తువులను ఎప్పటికప్పుడు తీసేస్తే మంచిదని లేనియెడల ఏవైనా అగ్నిప్రమాదాలు సంభవిస్తే మంటలు ఎక్కువగా చెలరేగే అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ అగ్నిమాపక సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం డిఎఫ్ఓ వై కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని ఈ వారోత్సవాలలో భాగంగా ఫ్యాక్టరీలలో, మాల్స్ లలో అనేక ప్రాంతాలలో వారికి మా సిబ్బంది అగ్ని సంభవించినప్పుడు ఎలా వాటిని ఎదుర్కోవాలో వారికి వివరించారని అంతేకాకుండా వారు నివసిస్తున్న ప్రాంతాలలో కూడా అగ్ని సంభవిస్తే ఏ విధంగా వారికి సహకారం అందించాలో కూడా మా సిబ్బంది నేర్పించారని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం అగ్నిమాపక ముగింపు వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో పిల్లలకు వ్యాచారచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు వాటిల్లో గెలుపొందిన పిల్లలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక సిబ్బంది ఎమ్మెల్యేతో మొక్కను నాటించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వి రామారావు, చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, వైస్ చైర్ పర్సన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి, కౌన్సిలర్ రాపర్తి ఉదయశ్రీ హరిప్రసాద్, ఫైర్ సిబ్బంది ఎం శ్రీనివాసరావు, ఆర్ నాగయ్య, జి శ్రీనివాసరావు, ఫైర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular