Wednesday, July 29, 2026
[t4b-ticker]

నల్లబండగూడెం సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

నల్లబండగూడెం సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

:నల్లబండగూడెం సాయి బాబా మహిమగల దేవుడు.

:ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పద్మావతి

Mbmtelugunews//కోదాడ, జులై 29(మాతంగి సురేష్) : కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో విరాజిల్లుతున్న సాయిబాబా చాలా మహిమగల దేవుడు ప్రతి ఒక్కరూ ఈ సాయి మందిరాన్ని సందర్శించాలని స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద వేంచేసియున్న సాయిబాబా మందిరంలో దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా వేద పండితులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిబాబా దయవలన రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడిపంటలతో సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా బాబా ఆశీర్వదించాలని కోరారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానని ఆమె తెలిపారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నల్లబండగూడెం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఆమె గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఉన్న బాబా మహిమగల దేవుడని ఈ బాబాను ప్రతి ఒక్కరూ సందర్శించి బాబా అనుగ్రహం పొందాలని అన్నారు. ప్రతి గురువారం భక్తులు ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం బాబా మహిమలకు నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన చైర్మన్ నల్లపాటి నరసింహారావును అభినందించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో దేవాలయ కమిటీ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ మల్లేశ్వరి, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కోదాడ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సామినేని ప్రమీల, నల్లబండగూడెం సర్పంచి అలసకాని భవాని శరబందేశ్వరరావు, మాజీ సర్పంచి ముండ్రా రంగారావు, మాజీ ఎంపీపీ మల్లెల రాణి, క్షేత్రయ్య, వీధిలాపురం శ్రీను, బట్టు పూర్ణ, శ్యాము, సుధాకర్, రామచందర్రావు, గురవయ్య, ఎన్ఆర్ఐ అనన్య తండ్రి వెంకన్న గౌడ్, ప్రత్యేకంగా సింగపూర్ నుండి బాబా మీద అభిమానంతో వచ్చిన వెంకట్ కుమార్తెలు, వేద పండితులు సాయి శర్మ, తదితర వేద పండితులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular