Wednesday, July 29, 2026
[t4b-ticker]

నీటి సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలి: సర్పంచి దున్నా శ్రీనివాస్.

నీటి సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలి: సర్పంచి దున్నా శ్రీనివాస్.

Mbmtelugunews//నడిగూడెం, 28(ప్రతినిధి మాతంగి సురేష్): నీటి సంరక్షణను ప్రజలందరూ ఉద్యమంలా చేపట్టాలని నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ కోరారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో శ్రీ శక్తి భవనం నందు రూప్ టాప్ గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీటి సంరక్షణ కొరకు విబిజిరాంజీ పథకం ద్వారా చేపడుతున్న ఇంకుడు గుంతలను ప్రతి ఇంటిలో నిర్మించుకోవాలని, ఇంటి డాబాల నుండి వచ్చే వర్షపు నీటిని సంరక్షించేందుకు రూప్ టాప్ గుంతలను నిర్మించాలని, కమ్యూనిటీ ఇంకుడు గుంతల ఏర్పాటు, అత్యవసరమని తెలిపారు. పంట కుంటలు,బోర్వెల్ రీఛార్జ్ గుంతలు, అందరూ తప్పక ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేశవపురం సర్పంచి గోసుల రాజేష్, నడిగూడెం ఉప సర్పంచ్ ఎలుగూరి నాగరాజు, ఏపీఓ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యుఎస్ ఏఈ సతీష్, ఈసీ శ్రీనివాసరావు, టెక్నికల్ అసిస్టెంట్, అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, సిఓ కృష్ణ, మహిళా సమాఖ్య మండల అకౌంటెంట్ జ్యోతి, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, సీతారాం రెడ్డి, సులోచన, జూనియర్ అసిస్టెంట్ వంశీ, కరివిరాల మాజీ సర్పంచ్ పాతకోట నాగేశ్వరరావు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular