Sunday, July 19, 2026
[t4b-ticker]

బుక్కెడు బువ్వ ఐదు కిలోమీటర్ల ప్రయాణం

బుక్కెడు బువ్వ ఐదు కిలోమీటర్ల ప్రయాణం

:ఎండలో, వానలో నడవాల్సిందే..!

Mbmtelugunews//కోదాడ, జులై 18(ప్రతినిధి మాతంగి సురేష్): అనంతగిరి మండలంలోని వెంకట్రామపురం గ్రామ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ గ్రామానికి రెండున్నర కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ సుమారు 100కు పైగా ఇళ్లు, 300 మంది నివాసం ఉంటున్నారు. అందరూ పేదవారే. గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు స్కూలుకి వెళ్లాలన్న రేషన్ బియ్యం తీసుకోవాలన్న అంగన్వాడి స్కూలుకు పంపాలన్న వృద్ధులు పెన్షన్ తీసుకోవాలన్న వీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో నివసిస్తున్న వృద్ధుల కష్టాలు చెప్పనవసరం లేదు. రేషన్ బియ్యం అందుకోవాలంటే రాను పోను సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సిందే. రేషన్ దుకాణం, అంగన్వాడి స్కూలు, ప్రభుత్వ చిన్న బడి వెంకట్రామపురం గ్రామంలో ఉంది. ఒక్కోసారి అంత దూరం నడిచి వెళ్లాక, రేషన్ దుకాణం నిర్వాహ కులు లేకపోతే ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఇలా వృద్ధులే కాదు, బాలింతలు, గర్భిణులు, నిత్యం ఇబ్బందులు పడుతు న్నారు. ప్రతి నెల సమస్య తీవ్రంగా ఉంటుందని, ఎండాకాలం ఎండ తీవ్రతకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రేషన్ బియ్యం నెలలో ఒక రోజు కాలనీలోనే ఇవ్వాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఈ చిత్రంలో రేషన్ బియ్యం ఎత్తుకొని నడుస్తున్న వ్యక్తి పేరు పర్వతం శ్రీను వయసు 35 ఏళ్లు. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఉంటారు. ప్రతి నెలా సుమారు ఐదు కిలో మీటర్లు నడిస్తేనే రేషన్ బియ్యం ఇంటి కొస్తున్నాయని, వాటిని తినే జీవనం సాగిస్తున్నామని పర్వతం శ్రీను తెలిపారు. ఆటోకు వెళ్లి బియ్యం తీసుకురావా లంటే రూ.100 ఖర్చు అవుతుందని, దీంతో కష్ట మైనా ప్రతి నెలా నడిచే వెళ్తున్నట్లు వివరించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular