కేటీఆర్ తెలంగాణ నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పగలరా?
:నేడు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలకు కొన్ని ప్రశ్నలు…
:పదేళ్ల మీ పాలనలో జరిగిన పేపర్ లీకులు, పరీక్షల రద్దులు, నోటిఫికేషన్ల ఆలస్యం, ఉద్యోగ నియామకాలలో జరిగిన నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది?
:10సం,, లో వారి ఆవేదన, వారి కన్నీళ్లు, వారి కుటుంబాల బాధలు ఎందుకు పట్టించుకోలేదు?
:మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ జడ్పీటీసీ బాణాల కవిత నాగరాజ్.
Mbmtelugunews//కోదాడ, జులై 18(ప్రతినిధి మాతంగి సురేష్): పరీక్షలు వాయిదా పడినప్పుడు, పేపర్లు లీక్ అయినప్పుడు, ఉద్యోగాల కోసం వేలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూసినప్పుడు… మీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఎందుకు నిలబడలేదు?ముందుగా పదేళ్ల పాలనలో జరిగిన తప్పులకు తెలంగాణ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పండి. ఆ తర్వాతే వారి గురించి మాట్లాడండి. మరోవైపు, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ప్రస్తుతం మరో 30 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్లు, ఖాళీల గుర్తింపు, ఆర్థిక శాఖ అనుమతులు తదితర దశల్లో కొనసాగుతోంది. కేటీఆర్ నిరుద్యోగుల పేరుతో రాజకీయాలు చేసే ముందు, పదేళ్ల మీ పాలనలో యువత భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం ఆడారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. తెలంగాణ నిరుద్యోగ యువతకు మా విజ్ఞప్తి… మాటలను కాదు, చేతలను నమ్మండి. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీని నమ్మొద్దని విషయాన్ని నిరుద్యోగులకు ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. నిజాలను తెలుసుకుని, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.బాణాల కవిత నాగరాజ్ మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ జడ్పీటీసీ



