Friday, June 12, 2026
[t4b-ticker]

శ్రమశక్తి అవార్డుకు నాదెళ్ల బాలకృష్ణ అర్హులు

శ్రమశక్తి అవార్డుకు నాదెళ్ల బాలకృష్ణ అర్హులు

:విద్యుత్ కార్మికులు పేద ప్రజలకు, రైతులకు సేవ చేయాలి.

: ఈ అవార్డు హుజూర్ నగర్ డివిజనకే గర్వకారణం

:సూర్యాపేట జిల్లా ఎస్ఈ ఏ శ్రీనివాసులు, హుజుర్ నగర్ డివిజన్ డిఈ ఎన్ వెంకటకృష్ణయ్య.

Mbmtelugunews//కోదాడ, మే 07(ప్రతినిధి మాతంగి సురేష్): ఉద్యోగాన్ని ఎవరైతే సేవగా భావించి ప్రజలకు సేవ చేస్తారో వారికి ఎప్పుడైనా గుర్తింపు ఉంటది అనడానికి నిదర్శనం ఈ శ్రమశక్తి అవార్డు అని సూర్యాపేట జిల్లా ఎస్ఈ ఏ శ్రీనివాసులు , హుజుర్ నగర్ డివిజన్ డిఈ ఎన్ వెంకటకృష్ణయ్య లు అన్నారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో హుజూర్ నగర్ డివిజన్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణ కి ఆత్మీయ అభినందన సభను గురువారం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు పాల్గొని సన్మాన గ్రహీత నాదెళ్ల బాలకృష్ణను ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణ ఉద్యోగరీత్య పేద మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది లేకుండా వారి సమస్యలను ఉద్యోగరీత్యా తీర్చుకుంటూ సమాజంలో ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పంతో సత్యమేవ జయతే సేవాసమితిని ఏర్పాటుచేసి ఎంతోమందికి ఆసరాగా నిలిచారని గుర్తు చేశారు. విద్యుత్ కార్మికులకు ఏదైనా సమస్య వచ్చిందంటే అండగా ఉంటూ వారికి ధైర్యాన్ని చెప్పుకుంటూ ఎంతోమందికి బాసటగా నిలిచారని గుర్తు చేశారు. విద్యుత్ కార్మికులు నాదెళ్ల బాలకృష్ణ కు ఈ అవార్డు రావడం హుజూర్ నగర్ డివిజనకే గర్వకారణమని అన్నారు.

విద్యుత్ శాఖలో రైతులకు, పేద ప్రజల పక్షాన నిరంతరం శ్రమ చేస్తున్న నాదెళ్ల బాలకృష్ణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత శ్రమశక్తి అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందించదగిన విషయమని అన్నారు. ప్రతి విద్యుత్ కార్మికులు బాలకృష్ణ లాగా ప్రజలకు విద్యుత్ సమస్యను తొందరగా తీర్చి విద్యుత్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కంపెనీ కార్య నిర్వాహక అధ్యక్షులు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు నేతగాని వెంకాన, జిల్లా కార్యదర్శి పి యాదగిరినాయుడు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల సత్యనారాయణ,ఇతర డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, ప్రముక వైద్యులు జాస్తి సుబ్బారావు, ఏ రామారావు, విద్యా వేత్తలు జానకిరామయ్య, హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుతుంబాక భాస్కర్, వీరేపల్లి మధుసూదనరావు, విద్యుత్ కార్మికులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular