33 వ వార్డులో సీసీ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన
:దశల వారీగా కోదాడ మున్సిపల్ అభివృద్ధికి కృషి: చైర్ పర్సన్ కుసుమ
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 16(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి కోదాడ మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం అన్నారు. మున్సిపల్ కమిషనర్ రమాదేవి,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి స్థానిక వార్డు కౌన్సిలర్ పగిడిపల్లి యెసు పాదంలతో కలిసి సిసి డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్న 35 వ వార్డుల అభివృద్ధికి పాలకవర్గంతో కలిసి కృషి చేస్తానని పాలకవర్గం కోదాడ మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలో పనులు నిర్వహిస్తున్న గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలతో పనులు నిర్వహించి సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు, మున్సిపల్ డిఈ, యువ నాయకులు ఎండి ఇమ్రాన్, సంతోష్, రోషన్, 34 వార్డు కౌన్సిలర్ గంధం బాలెంద్ర పాండు, స్థానిక సీఎస్ఐ పాస్టర్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.



