కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పదు…
•రుణమాఫీతో అనేక కుటుంబాలకు మేలు
•కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించింది:కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బాణాల కవిత నాగరాజు
కోదాడ,జులై 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే తప్పదని,రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ మరోసారి కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘాల చైర్పర్సన్ బాణాల కవిత నాగరాజు అన్నారు.మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ…
రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో,కోదాడ శాసనసభ్యులు ఎన్ పద్మావతి నాయకత్వంలో కోదాడ నియోజకవర్గ రైతులందరికీ గడువులోగా ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయాలని తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆమే అభివర్ణించారు.రుణమాఫీతో నియోజకవర్గంలో చాలా కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్నారు.గతంలో కూడా ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కుంతుందన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తున్నట్లుగా స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు.తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు.