కామ్రేడ్ మావోకు విప్లవ జోహార్లు!
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 09:స్థానిక లాల్ బంగ్లాలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ మావో48వ,వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ చైనా విప్లవోద్యమ రథసారథి మార్క్సిజాన్ని వెనకబడిన దేశమైన చైనాకు అన్వయింపు చేసుకొని చైనాలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేసిన మహా నాయకుడు,కమ్యూనిస్టు మహోపాధ్యాయులలో ఒకరు పీడిత దేశాలలో జరిగే విప్లవోద్యమాలకు విప్లవకారులకు ఆదర్శప్రాయుడు కామ్రేడ్ మావో అని అన్నారు.కమ్యూనిజాన్ని విస్తరింప చేయడంలో మావో పాత్ర కీలకమైనదని,భారతదేశ విప్లవోద్యమ విజయవంతకై మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం భారత దేశ విముక్తికి వెలుగు దారిఅని అన్నారు,మావో చూపిన దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుద్ధ పంథాయే మనలాంటి వెనుకబడిన దేశాల విప్లవోద్యమాలకు దిక్చూచి అని తెలిపారు.కామ్రేడ్ మావోకు ఘనంగా విప్లవ జేజేలు పలికారు.ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా నాయకులు కామల్ల అనంతరామయ్య,కామల్ల ప్రతాప్,విజయ్,వీరబాబు,కొండయ్య,మైసయ్య,నాగేష్,సలీం,రవితేజ,ఖాసిం,వెంకన్న,నరసింహరావ్ తదితరులు పాల్గొన్నారు