Monday, December 23, 2024
[t4b-ticker]

సర్పంచ్​ ఏకగ్రీవం

- Advertisment -spot_img

సర్పంచ్​ ఏకగ్రీవం

:సొంత పైసలతో బొడ్రాయి పండగ..

:ఇంటింటికి రూ. 1000.

Mbmtelugunews//వరంగల్​ జిల్లా, సెప్టెంబర్ 20:తెలంగాణలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే వరంగల్​ జిల్లా చెరువుకొమ్ము తండా సర్పంచ్ ఏకగ్రీవమయ్యాడు.సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి పండగ,పోచమ్మతల్లి,ఆంజనేయుడికి మూడు గుళ్లు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి ఖర్చు కోసం ఇంటింటికి రూ.1000 చొప్పున పంచుతానని దరావత్​ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.అందుకుగానూ సర్పంచ్​ ఎన్నికల్లో ఎవరూ పోటీచేయకుండా,తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్​పెట్టాడు.అయితే మాట తప్పితే ఎలా అని గ్రామస్థులు బాలాజీని ప్రశ్నించడంతో ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తిచేస్తానని మాట ఇచ్చాడు బాలాజీ.దీంతో సోమవారం ఊరోళ్లంతా గ్రామంలో మీటింగ్​ పెట్టుకుని అగ్రిమెంట్​పేపర్​ రాసుకున్నారు. ఒప్పందం ప్రకారం..గడువులోగా పనులు పూర్తయితే బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలి. దీనిని ఒకవేళ ఎవరైనా అతిక్రమించి నామినేషన్ వేస్తే..బాలాజీకి రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్ లో రాసుకున్నారు.అగ్రిమెంట్ పై ఇరుపక్షాలవారు సంతకాలు చేయగానే సర్పంచ్​అభ్యర్థితోపాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని, వేడుకలు చేసుకున్నారు.కాగా చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా,700 మంది

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular