Monday, December 23, 2024
[t4b-ticker]

పేదలం భరించలేని నష్టం జరిగిందిఆదుకోవాలని కేంద్ర బృందాలకు రైతుల వేడుకోలు…

- Advertisment -spot_img

పేదలం భరించలేని నష్టం జరిగింది
ఆదుకోవాలని కేంద్ర బృందాలకు రైతుల వేడుకోలు…

Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 12:కోదాడ నియోజకవర్గం లోని వరద ప్రభావిత ముప్పు ప్రాంతాలైన అనంతగిరి మండల పరిధిలోని గోండ్రియాల,కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి,నడిగూడెం మండల పరిధిలోని కాగితరామచంద్రపురం లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర అధికారుల బృందం.కోదాడ నియోజకవర్గంలో ఇటీవల కురిచిన వర్షాలు వల్ల వరద నష్టం అంచనాల కోసం క్షేత్ర స్థాయి లో గురువారం గోండ్రియాల,తొగర్రాయి,కాగిత రామచంద్రపురం గ్రామాలలో కేంద్ర అధికారుల బృందం పర్యటించారు.ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్,మహేష్ కుమార్,శాంతినాధ్ శివప్ప లు కోదాడ నియోజకవర్గంలో పర్యటించి వరద ముప్పు కి గురైన ఇండ్లను,వరద లో మునిగిన అలాగే ఇసుక మెటలు పెట్టిన పొలాలను,వరదతో దెబ్బతిన్న విద్యుత్ స్టంబాలను పరిశీలించారు.నిరుపేదలం భరించలేని నష్టం జరిగింది,ఆదుకోవాలని కేంద్ర బృందాలకు రైతుల వేడుకొన్నారు.నీట మునిగిన పొలాలు,ఇసుక మేట వేసిన పంటలు చూసారు,పూర్తి నివేదిక అందిస్తామన్నారు.ఖమ్మం నుంచి వచ్చిన అధికారుల బృందానికి గోండ్రియాల లో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆహ్వానించారు.గోండ్రియాల లో వరద ముప్పుతో కూలిన గూటి పార్వతమ్మ,గంటు గరతయ్య ఇండ్లని పరిశీలించారు.అలాగే వరదతో ఇంట్లోని సామాగ్రి అంత కొట్టుకోనిపోయిన గౌరవరపు రవి ఇంట్లోకి వెళ్ళి చూసారు.అలాగే మండల ప్రాధమిక పాఠశాలను,ఉన్నత పాఠశాలలను అధికారుల బృందం పరిశీలించారు.గ్రామంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్ వేదజల్లాలని,యాంటీ లార్వా స్ప్రే చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.గ్రామంలో 15 రోజులలో 3 సార్లు డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే చేయాలని వైద్యాధికారులకు సూచించారు.తదుపరి తొగర్రాయి గ్రామంలో వరద ముప్పుతో తెగిన రోడ్డు,వంతెనను పరిశీలించారు.తెగిన రోడ్డు వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఛాయ చిత్ర ప్రదర్శన ద్వారా జిల్లా కలెక్టర్ గ్రామంలో వరద వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర అధికారుల బృందానికి వివరించారు.అనంతరం వరద ముప్పుతో దెబ్బ తిన్న నామాల సాయిలు ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడినారు.అలాగే వరద తో ఇంట్లో సామాగ్రి అంత కొట్టుకోనిపోయిన వంగాల మమత తో మాట్లాడి నష్ట పరిహారం అందేలా చూస్తామని అన్నారు.అలాగే వరదతో కూలిన విద్యుత్ స్తంబాలపై,విద్యుత్ సరఫరా పై అధికారులు కేంద్ర అదికారుల బృందానికి వివరించారు.అనంతరం వరదతో మునిగిపోయిన పంటలు,కోతకు గురై ఇసుక మేటలు పెట్టిన పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు.

ఈ సందర్బంగా రైతులు భారీ వర్షంతో వచ్చిన వరద వలన జరిగిన నష్టాన్ని కేంద్ర అధికారులకు వివరించారు.నడిగూడెం మండలం కాగితరామచంద్రపురం వద్ద యన్ఎస్పి ఎడమ కాలువకు పడిన గండిని పరిశీలించారు.పాలేరు రిజర్వాయర్ లో 9 అడుగులు మేర నీరు ఎక్కువ రావటం తో అవి వెనక్కి వచ్చి గండి పడిందని కలెక్టర్ వివరించారు.వేగవంతంగా కాలువ లైనింగ్ పనులు,గండి పూడ్చటం త్వరగా పూర్తి చేసి ఆయకట్టుకి నీరు విడుదల చేయాలని కేంద్ర అధికారుల బృందం ఇరిగేషన్ అధికారులను ఆదేశించగా వారం రోజుల్లో గండి పూడ్చి నీరు విడుదల చేస్తామని కేంద్ర అధికారుల బృందానికి తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఆర్డిఓ సూర్యనారాయణ,జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి,ఇరిగేషన్ డిఈ రఘు,తహసీల్దార్లు హిమ బిందు,వాజీద్ అలీ,సరిత,యంపిఓ పాండు రంగన్న,కార్యదర్శిలు వీర ప్రభాకర్,అభిలాష్,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular