జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎన్నికైన వంగవీటి రామారావుకి సన్మానం
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగవీటి రామారావుని కొమరబండలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా,బొకేతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొదటినుంచి పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి,వంగవీటి రామారావుకి జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం,చాలా హర్షించదగ్గ విషయమని,రానున్న రోజుల్లో జిల్లాలోని గ్రంథాలయల అభివృద్ధికి కృషి చేస్తూ మంచి వన్నెతెస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో
యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ ఒంటెపాక యేషయ,కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుడుముల రాంబాబు తదితరులు పాల్గొన్నారు…