ఘనంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనగాల రాధాకృష్ణ జన్మదిన వేడుకలు.
:ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి:ముస్లిం మైనార్టీ యూత్ సభ్యులు
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 16 (ప్రతినిధి మాతంగి సురేష్):మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనగాల రాధాకృష్ణ జన్మదిన వేడుకలను శనివారం ముస్లిం మైనార్టీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా గజమాలతో ఘనంగా సన్మానించి కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ్మర బండపాలెం గ్రామంలో వారి తాత గ్రామ పెద్దాయన కనగాల ధర్మయ్య వంశ వృక్షము నుండి వెంకట్రామయ్య,హైమావతి పుణ్య దంపతులకు ఉద్భవించిన వ్యక్తి అని కొనియాడారు.తన రాజకీయ జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక భరోసా నింపిన నిబద్ధత కలిగిన వ్యక్తి అని కొనియాడారు.చిన్నతనం నుండి కాంగ్రెస్ పార్టీ హావభావాలు కలబోసుకొని ఈరోజు వరకు కూడా ఒక మచ్చలేని వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నాడని అన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా మీకు నేనున్నానంటూ మనో ధైర్యాన్ని నింపుతూ ఈ గ్రామం ప్రజలలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడని అన్నారు.

భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో షేక్ జానీ,మక్బుల్,నసీర్,సమీర్,షఫీ,షరీఫ్,లతీఫ్,మజీద్,హఫీజ్,నసీర్,సాధిక్,రఫీ,నాగుల్,నూర్ తదితరులు పాల్గొన్నారు