ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ.
:రంగా థియేటర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్వేరోస్ నెట్వర్క్
:ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని:స్వేరోస్ నెట్వర్క్ కోదాడ
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్):స్వేరోస్ ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన సందర్భంగా స్వేరోస్,ఆర్ఎస్పి అభిమానుల ఆధ్వర్యంలో కోదాడ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.అలాగే రంగా థియేటర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా వేడుకలలో పాల్గొన్న స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కిరణ్ మాట్లాడుతూ నిరుపేదలకు చెందిన లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను గురుకులాల సాక్షిగా అందించి అనేకమంది బిడ్డలను విద్య ,క్రీడా, సేవా,వ్యాపార రంగాలలో అనేకమంది ఉన్నత స్థాయికి చేరుకునేలా గొప్పగా తీర్చిదిద్దున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేద జీవితాలకు ఆశాజ్యోతి గా నిలిచారని ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వేరోస్,ఆయన అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెడపంగు రవికుమార్,కొండ భీమన్న గౌడ్,శిల్పి సుధాకర్,చెడపంగు నాగార్జున,ఏసుబాబు,సురేష్,జ్యోతి,రాణి,పాముల రాకేష్,చిరంజీవి,కొండపల్లి శ్రీకాంత్,మంద కళ్యాణ్,పాముల శంబయ్య,కొండపల్లి దిలీప్,రామారావు,సత్తయ్య,నరేందర్,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.