కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను తక్షణమే భర్తరఫ్ చేయాలి
:అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి.
:బాబాసాహెబ్ జోలికి వస్తే ఖాబర్దార్.
:కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గుండెపంగు. రమేష్
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 20(ప్రతినిధి మాతంగి సురేష్)పార్లమెంటులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అవమాన పరిచిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు..
అనంతరం మాట్లాడుతూ..చాయ్ అమ్మే వ్యక్తిని కూడా ప్రధానమంత్రిగా చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఉన్నదని గుర్తు చేశారు.దేశంలోని బహుజన కులాలకు అంబేద్కరే అసలైన దేవుడన్నారు.అంబేద్కర్ గారిని అవమాన పర్చడం అంటే దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలను అవమానపరచడమే అన్నారు.బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని అది పార్లమెంటు సాక్షిగా బయటపడిందన్నారు.డాక్టర్
అంబేద్కర్ భిక్షతో అమిత్ షా హోమ్ మంత్రి అయ్యాడని ఈ విషయం అమిత్ షా గుర్తు పెట్టుకోవాలన్నారు.బాబా సాహెబ్ జోలికి వస్తే కబర్ధార్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.వెంటనే దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పి మంత్రి పదవి నుండి తప్పుకోవాలన్నారు.