వినూత్న రీతిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తో విద్యార్థి ఇంటర్వ్యూ…
:విద్యార్థులలో నైపుణ్య, సృజనాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి….
:ఇంటర్వ్యూ చేసిన విద్యార్థినికి అభినందనలు..
:కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్
Mbmtelugunews కోదాడ, సెప్టెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ హస్మత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ని వినూత్న పద్ధతిలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
విద్యార్థిని ముందుగా తయారు చేసుకున్న ప్రశ్నావళితో ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ ని వారి బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం, అనుభవాల గురించి, విద్యాధికారిగా విద్యావ్యవస్థ పట్ల అభిప్రాయాలను ఇంటర్వ్యూ పద్ధతిలో ముఖాముఖిగా అడిగి తెలుసుకోవడం జరిగింది.

విద్యార్థులు పాఠ్యాంశాల చదువుతోపాటు జీవన నైపుణ్యాలు, జీవనోపాధికి అవసరమైన రంగాలలో సామర్థ్యాలు సాధించటం అవసరం, ఈ విధంగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన విద్యార్థిని ఎండి సలీం షరీఫ్ అభినందనలు తెలియజేసినారు. పాఠశాల తెలుగు శాఖ విభాగం ఉపాధ్యాయులు ఎం వీర బ్రహ్మచారి, ఎం చిన్నప్ప, యం జానకిరాములు, విద్యార్థులు కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నారు.



