అన్ని దానాల కన్నా గొప్పదానం రక్తదానం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): టిపిసిసి డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కిరాజు రజనీకాంత్ మాలోవత్ చైతన్య నాయక్ లు రక్తదానం చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజులలో కూడా రక్తదానం చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాతంగి సురేష్, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



