Sunday, February 8, 2026
[t4b-ticker]

సావిత్రిబాయి చూపిన దారిలో మహిళా విద్యా ప్రగతి

సావిత్రిబాయి చూపిన దారిలో మహిళా విద్యా ప్రగతి

Mbmtelugunews//కోదాడ, జనవరి 03(ప్రతినిధి మాతంగి సురేష్): మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు సమాజ కట్టుబాట్లను సవాల్ చేస్తూ దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన సావిత్రిబాయి పూలే జయంతిని ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో కోదాడ కాంగ్రెస్‌ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆనాడు సావిత్రిబాయి పూలే చేసిన సాహసం ఈనాడు మహిళలు విద్యారంగంలో ముందడుగు వేయడమే కాకుండా, పురుషులకన్నా మిన్నగా అవకాశాలను సద్వినియోగం చేసుకునే స్థాయికి తీసుకొచ్చిందన్నారు. మహిళా విద్యకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, పారా సీతయ్య, ఎర్నేని వెంకటరత్నం బాబు, కందుల కోటేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, పాలూరి సత్యనారాయణ, లిక్కి మోహన్‌రావు, మాలోతు సైదా నాయక్‌, రావెళ్ల కృష్ణారావు, గుండెల సూర్యనారాయణ, గంధం యాదగిరి, బాజాన్‌, బాగ్దాద్‌, బాబా, అలీ, మెండం సైదిబాబు, ఎస్‌ దాని, డేగ శ్రీధర్‌, గంధం పాండు, గుండంపంగు రమేష్‌, ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular