Wednesday, February 4, 2026
[t4b-ticker]

జనవరి ,10 న ఛలో కోదాడ

జనవరి ,10 న ఛలో కోదాడ

Mbmtelugunews//నడిగూడెం, జనవరి 09(ప్రతినిధి మాతంగి సురేష్): చిలుకూరు ఎస్సై కోదాడ రూరల్ సిఐల పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం.జనవరి ,10 న ఛలో కోదాడ కార్యక్రమానికి కోదాడ నియోజకవర్గం లోని నడిగూడెం మండల కేంద్రంలో పందిటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భుంజురు విజయ్ మాదిగ, చాతాల్ల రమేష్ మాదిగ, చింత వినయ్ బాబు మాదిగ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 10న కోదాడ పట్టణంలో నిర్వహించబోయే కర్ల రాజేష్ సంతాప సభ జయప్రదం చేయడానికి ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున మాదిగ ప్రజలు తరలిరావాలని కోరడం జరిగింది. జనవరి 10న జరగబోయే చలో కోదాడ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో దున్న వంశీ మాదిగ, నాగవరపు రోహిత్ మాదిగ, వేపూరి రిత్విక్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular