పచ్చిపాల మహేశ్వరి సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్టిక్ టి20 టోర్నమెంట్ కు ఎంపిక
:కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ అబూ బకర్ సిద్ధిక్
Mbmtelugunews//కోదాడ, జనవరి 24(ప్రతినిధి మాతంగి సురేష్): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) ఆధ్వర్యంలో నిర్వహించే సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్టిక్ టి20 టోర్నమెంట్, 2026 కు కోదాడ క్రికెట్ అకాడమీ మహిళా క్రికెటర్ పచ్చిపాల మహేశ్వరి ఎంపికైన విషయం హర్షణీయం. నల్గొండ వేదికగా మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన ఇంట్రా నల్గొండ జిల్లా టి 20 లీగ్ ఫైనల్ మ్యాచ్ లో పచ్చిపాల మహేశ్వరి 36 పరుగులు (నాటౌట్) సాధించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఆమె అద్భుత ఆటతీరుకు గుర్తింపుగా బెస్ట్ బ్యాటర్ అవార్డు కూడా అందుకున్నారు.ఈ ప్రతిభకు గుర్తింపుగా పచ్చిపాల మహేశ్వరిని జనవరి 27 నుండి ఫిబ్రవరి 1 వరకు వరంగల్ వేదికగా జరగనున్న సీనియర్ ఉమెన్స్ ఇంటర్ డిస్టిక్ టి20 టోర్నమెంట్, 2026 లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ మహిళల జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ అబూ బకర్ సిద్దిఖ్ ను, అలాగే క్రీడాకారిణి పచ్చిపాల మహేశ్వరిని కోదాడ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, మండల విద్యాశాఖ అధికారి మొహమ్మద్ సలీం షరీఫ్,
కోదాడ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు దర్గయ్య, బడుగుల సైదులు, నాయిని నాగేశ్వరరావు, చంద శ్రీను జబ్బార్, శ్రీకాంత్, తుమ్మల సురేష్, చక్కెర రవీందర్ రెడ్డి , బాలరాజు, మాదాసు సురేష్, తదితరులు హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు.



