Sunday, May 31, 2026
[t4b-ticker]

ఆంధ్రజాతీయ క్రీడాకారుడు ప్రపంచ రికార్డ్ దారుడు కేఎస్ రావు

ఆంధ్రజాతీయ క్రీడాకారుడు ప్రపంచ రికార్డ్ దారుడు కేఎస్ రావు

:రాష్ట్ర స్థాయి యోగ జడ్జి గా
దృవా పత్రం  అంద జేశారు.

Mbmtelugunews//కోదాడ, మే 31(మనం న్యూస్): సిద్ధిపేట లో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి యోగా జడ్జి శిక్షణ శిబిరంలో ప్రముఖ యోగా గురువు, అంతర్జాతీయ క్రీడాకారుడు, ప్రపంచ రికార్డుదారుడు, స్వర్ణ పతక విజేత కెఎస్ రావు యోగాసన భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి యోగా జడ్జి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయి యోగా జడ్జిగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు. యోగా క్రీడాభివృద్ధికి ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు ఇది మరో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచింది.యోగా, స్విమ్మింగ్, ట్రాక్ ఈవెంట్లలో అసాధారణ ప్రతిభ కెఎస్ రావు  యోగా రంగానికే పరిమితం కాకుండా స్విమ్మింగ్, యోగా,
ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అనేక స్వర్ణ పతకాలను సాధించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు పోటీలలో విజేతగా నిలిచి క్రీడా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ప్రపంచ రికార్డులతో విశ్వవ్యాప్త ఖ్యాతి యోగా రంగంలో ఆయన సాధించిన విశేష విజయాలకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లలో స్థానం సంపాదించి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని పొందారు. యోగా ప్రచారం, ఆరోగ్య చైతన్యం, క్రీడా వికాసానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవిగా నిలిచాయి. కోదాడ బాయ్స్ హై స్కూల్‌లో  సలీంషరీఫ్, మార్కండేయుల ఆధ్వర్యం లో యోగా మాస్టర్‌గా విశిష్ట సేవలు అందిస్తున్నారు. కెఎస్ రావు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి, ఆరోగ్య అవగాహన, క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులకు శిక్షణ అందించి జిల్లా, రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ  స్థాయి పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ వారి విజయాలకు బాటలు వేస్తున్నారు.

*క్రీడా రంగంలో కుటుంబం కూడా స్ఫూర్తిదాయకం*

కెఎస్ రావు  స్ఫూర్తితో ఆయన పిల్లలు కీత శ్రీకార్తికేయ వర్మ, కీత శ్రీలాస్య వర్మలు కూడా చిన్న వయస్సులోనే స్విమ్మింగ్, యోగా రంగాలలో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. పలు పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుంటూ తమ తండ్రి అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నారు. క్రీడా కుటుంబంగా వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామీణ ప్రతిభను ప్రపంచ వేదికపై నిలపాలనే లక్ష్యం
ఈ సందర్భంగా కెఎస్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అపార ప్రతిభ దాగి ఉందని, సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే గ్రామీణ విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు సాధించగలరని అన్నారు. యోగా, క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంతో పాటు ప్రపంచ వేదికలపై భారత యువత సత్తా చాటేలా తీర్చిదిద్దడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు.

*గురువులకు కృతజ్ఞతాభివందనాలు*

రాష్ట్ర స్థాయి యోగా జడ్జి శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకోవడంలో సహకరించిన యోగాసన భారత్ సంస్థకు, రామిరెడ్డి, సతీష్, కృపాకర్ లకు, అలాగే ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత నాగేశ్వరరావుకు కెఎస్ రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి మార్గదర్శకత్వం తన విజయ ప్రస్థానంలో చిరస్మరణీయమని పేర్కొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular