Sunday, May 3, 2026
[t4b-ticker]

క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహద పడతాయి

క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ద్రోహద పడతాయి

:కోదాడలో జర్నలిస్టుల క్రికెట్ మ్యాచ్

Mbmtelugunews//కోదాడ,మే 03 (ప్రతినిధి మాతంగి సురేష్): క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతో ద్రోహదపడతాయని పలువురు తెలిపారు. ఆదివారం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా కోదాడ జర్నలిస్టులు స్థానిక కటకొమ్మ గూడెం రోడ్డు బైపాస్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం వార్తా విధుల్లో నిమగ్నమయి వారి ఆరోగ్యాలను కూడా లెక్కచేయకుండా ఉంటారు. అలాంటి వారికి క్రీడా పోటీలు ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించినట్లయితే ఈ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మాతంగి సురేష్, జూలూరి బసవయ్య, శ్రీకాంత్, శ్రీహరి, చరణ్, శ్రీనివాస్, మణికంఠ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular