Tuesday, July 14, 2026
[t4b-ticker]

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం

వ్యాయామం తో సంపూర్ణ ఆరోగ్యం

:ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం ఎంతో అవసరం-

:యువత భవిష్యత్తు ను తీర్చి దిద్దేవిగా జిమ్ లు ఉండాలి.

:ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి.

Mbmtelugunews// కోదాడ, జూలై 13(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలో యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, క్రమశిక్షణ, ఏకాగ్రత, నిరంతర సాధనే విజయానికి పునాది అని ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ మేళ్లచెరువు రోడ్డులో ఈషా ఇన్స్పైర్ భవనంలో ప్రారంభమైన ఓజీ ఫిట్నెస్ స్టూడియోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం ఎంతో అవసరమని, యువతతో పాటు మహిళలు, ఉద్యోగులు కూడా ప్రతిరోజూ కొంత సమయం శారీరక దృఢత్వానికి కేటాయించాలని సూచించారు.

ఆరోగ్యకరమైన శరీరం, దృఢమైన మనసు ఉంటేనే సమాజాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. స్టూడియో నిర్వాహకులు కోదాడ ను ఫిట్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. వ్యాయామం కేవలం శరీరాకృతికే కాకుండా ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణను పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహబూబ్ జానీ, కౌన్సిలర్ లు,స్టూడియో నిర్వాహకులు ఆలేటి రాంబాబు,డా, కొత్తపల్లి సురేష్, హుస్సేన్, నవీన్, ఫిట్నెస్ ట్రైనర్లు, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular