విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలి
Mbmtelugunews//కోదాడ, జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్): విద్యార్థులు చదువుతోపాటు ఆటలలో రాణించి పుట్టిన గ్రామానికి చదువుకున్న పాఠశాలకు ముంచు గుర్తింపు తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి బాలాజీ అన్నారు. మండల పరిధిలోని గణపవరం ప్రాథమిక పాఠశాలలో జనవరి 26 రిపబ్లిక్ డే కి పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు గ్రామానికి చెందిన క్రీస్తు శేషులు కామిశెట్టి వీరభద్రయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు భోజనం ప్లేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లేట్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలాజీ చేతుల మీదుగా అందించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఇలా ప్రోత్సహించటం వలన వారు చదువుతోపాటు వివిధ రంగాలలో రాణించటానికి ఎంతో దోహదపడుతుందని వారు అన్నారు. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



