కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్.
Mbmtelugunews//నడిగూడెం, జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్): మండల కేంద్రనికి చెందిన వల్లెపు శ్రీను ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు గ్రామ శాఖ అధ్యక్షులు బోళ్ల నర్సిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు పార్టీ నుండి శ్రీనును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసిన పార్టీ నాయకులను విమర్శించిన పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ విడలేదని గతంలో టిడిపి టీఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ లో జాయిన్ అయిన వారు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలకు తిరిగి వెళ్లారని వారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నాయకత్వంలో గ్రామం ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పందిరి కళావతి వెంకటరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, మండల కార్యదర్శి వేపూరి సుధీర్, మాజీ ఎంపిటిసి గుండు శ్రీను, నాయకులు పల్లపు శ్రీను, గుండు విజయ రామారావు, శ్రీరాముల శ్రీను, కత్తి విజయ్, సోమనబోయిన అంజయ్య, పల్లపు గోపాల్, షేక్ జలాలుద్దీన్, తరుణ్ రెడ్డి, శ్రీకాంత్, దినేష్, విజయ్, సామద్ ఆసిఫ్ తదితరులు ఉన్నారు.



