ప్లాస్టిక్ విస్తళ్ళ వాడకం ఆరోగ్యానికి హానికరం
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 19( ప్రతినిధి మాతంగి సురేష్): పురపాలిక లో ప్లాస్టిక్ విస్తళ్ళు, గ్లాసుల వాడకం పై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. ప్లాస్టిక్ విస్తళ్ళ ను విరివిగా వాడటం వల్ల పర్యావరణానికి, మనిషి ఆరోగ్యానికి పెనుప్రమాదమని పర్యావరణ ఊర్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ అన్నారు. కనీసం అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీస్ లో నైనా ప్లాస్టిక్ విస్తళ్ళు, గ్లాసులకు బదులు స్టీల్ వంటి లోహ విస్తళ్ళు గ్లాసులను వాడి మనిషి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తన ఆలోచనలు పర్యావరణ హితంగా ఆచరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుండటం విదితమే. వివిధ హానికారక రాసాయానాలతో తయారు చేసే ప్లాస్టిక్ విస్తళ్ళలో వేడి వేడి ఆహారపదార్ధాలను తినటం వల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతూ స్టీల్ పళ్లెం లో భోజనం చేస్తూ పలువురుని ఆలోచింపచేస్తున్నారు. కాగా స్టీల్ పళ్లెం గ్లాసును తనవెంట ఉండే సంచి లో ఇంటి వద్ద నుండే తెచ్చుకుంటారు. పట్టణం లో శ్రీమన్నారాయణ నగర్ కాలనీలో ఓ విందులో స్టీల్ పళ్లెం లో భోజనం చేస్తున్న కొల్లు లక్ష్మీనారాయణ



