Wednesday, February 25, 2026
[t4b-ticker]

రఘు ఆశయాలను సాధిద్దాం: పూర్ణ చందర్ రావు

రఘు ఆశయాలను సాధిద్దాం: పూర్ణ చందర్ రావు

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 25: కోదాడ మాజీ ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పరిశాల రఘు ఆశయాలను సాధించిన నాడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు అని కోదాడ ఎలక్ట్రాన్ మీడియా గౌరవ అధ్యక్షులు పూర్ణ చందర్ రావు అన్నారు. రఘు ప్రథమ వర్ధంతి సందర్భంగా పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో విలేకరులు రఘు సమాధి వద్దకు వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ పడిశాల రఘు ఎలక్ట్రాన్ మీడియా రంగానికి ఎనలేని సేవలు చేసి ఎలక్ట్రాన్ మీడియా రంగం అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. విలేకరులకు ఆపదంటే అర్ధరాత్రి అయినా లెక్క చేయకుండా వారి సమస్యను పరిష్కరించిన తర్వాతనే తన పనులు చూసుకునేవాడని అలాంటి ఉన్నత విలువలు కలిగిన జర్నలిస్టును కోల్పోవడం ఎలక్ట్రాన్ మీడియా రంగానికి తీరని లోటు అని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు బంకా వెంకటరత్నం, చీమ చంద్రశేఖర్, ఏపూరి సునీల్ రత్నాకర్, ఎన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular