ఆకాశమే హద్దుగా మహిళా సమాజం ఎదగాలి
:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ, మర్చి 07(ప్రతినిధి మాతంగి సురేష్): ఆకాశమే హద్దుగా మహిళా సమాజం ఎదగాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పద్మావతి రెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యంగా మారిన మహిళలు అన్నింటా సమాజంతో పోటీ పడాలని పిలుపునిచ్చారు.అంతరిక్షంలో సైతం మగువ అడుగు పెట్టిన సందర్భాన్ని ఆమె ఉటంకిస్తూనే వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి, రాణి రుద్రమదేవి,దివంగత ప్రధాని ఇందిరగాంధీ స్ఫూర్తిని అలవరచుకుని అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని ఆమె ఉద్బోధించారు.



