విద్వేషపూరిత పోస్టులు పెడితే 7ఏళ్ల వరకు జైలు: మంత్రి పొన్నం ప్రభాకర్
Mbmtelugunews//హైదరాబాద్, మార్చి 30(ప్రతినిధి మాతంగి సురేష్): అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపై సోషల్ మీడియా వేదికలపై కులమతాలను నిందిస్తూ, మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, రాతల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు. నిందితులకు కఠినశిక్షలు విధించేలా, బాధితులకు న్యాయం జరిగేలా బిల్లు ఉంటుందన్నారు. నేరస్థులకు 1- 7 ఏళ్లు జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.



