డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత :సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, మార్చి 31(ప్రతినిధి మాతంగి సురేష్):డ్రగ్స్ నిర్మూలన,మహిళల పిల్లల భద్రత సైబర్ మోసాలపై అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సర్పంచి పాలకు సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో సోమవారం రాత్రి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోదాడ రూరల్ ఎస్ఐ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత రోడ్డు ప్రమాదాల నిర్మూలన, మహిళలు,పిల్లల భద్రత, సైబర్ మోసాలపై అవగాహన కల్పించుట, యువత విద్యా ఉపాధి అవకాశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి పాలకి సురేష్ పాల్గొని మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు ఈజీ మనీ కి అలవాటు పడకుండా కష్టపడి చదివి మంచి ఫలితాలను అనుభవించి కన్న తల్లిదండ్రులకు, సొంత గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. పిల్లలు చెడు అలవాట్లకు బానిస కాకుండా తల్లిదండ్రులు వారి పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులైన అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కానిస్టేబుల్స్ ప్రవీణ్, వీరప్రసాద్, వార్డ్ మెంబర్ పాలడుగు జాన్, మాజీ వార్డ్ మెంబర్స్ నాగేంద్రబాబు, ఏసోబు, శీలం కోటేశ్వరరావు, కంచర్ల రామకృష్ణ, నోముల బాలకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



