పార్క్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్
కోదాడ అర్బన్ పార్క్ కు యుద్ధ పదికన అభివృద్ధి చర్యలు
అర్బన్ పార్క్ ను పరిశీలించి మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు…
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 04( ప్రతినిధి మాతంగి సురేష్): పార్క్ సమస్య రీల్స్ చేసే వరకు తెస్తారా అంటూ అధికారులపై చైర్ పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శనివారం కోదాడ మున్సిపల్ పరిధిలోని ఉత్తమ్ పద్మావతి నగర్ లో గల అర్బన్ పార్కు ను ఆమె పరిశీలించారు. పార్కులో యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులకు ఆదేశించి పనులు పర్యవేక్షించి మాట్లాడారు.పార్క్ నిర్వహణ కు ఇద్దరు కామాటిలు కేటాయించాలని అధికారులకు ఆదేశించారు. గతం లో లక్షల రూపాయలు వ్యయం చేసి ఏర్పాటు చేసిన పార్క్ ఈ దుస్థితి కి చేరడం పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు.

కాగా స్పందించిన చైర్ పర్సన్ పార్క్ లో అన్ని సదుపాయాలు కల్పించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామనీ ఆదేశించారు. స్థానిక వార్డు ఆఫీసర్ వార్డు పార్క్ పర్య వేక్షణ చేయాలన్నారు. మునిసిపల్ బడ్జెట్ కేటాయించి పిల్లలు ఆటలు ఆడే పరికరాలు, ఆహ్లాద కర వాతావరణం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 8 వార్డ్ కౌన్సిలర్ రామినేని ఉదయశ్రీ ప్రసాద్, మున్సిపల్ డిఈ సాయి లక్ష్మి, నాయకులు ఖాజా ఉన్నారు.



