Monday, April 13, 2026
[t4b-ticker]

రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి: సర్పంచి పాలకి సురేష్

రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి: సర్పంచి పాలకి సురేష్

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్13 (ప్రతినిధి మాతంగి సురేష్): రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచి పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని ద్వారకుంట గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా అరైవ్-అలైవ్ రోడ్డు భద్రత ఉద్యమం రవాణా దారుల భద్రత రోడ్డు ప్రమాదాల నిర్మూలన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వాజిద్ అలీ పాల్గొని ప్రజల చేత రోడ్డు ప్రమాదాలపై భద్రత కొరకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.రోడ్డుప్రమదాలు జరుగకుండా టు వీలర్ నడిపే వాళ్ళు తలకు హెల్మెంట్ తప్పకుండా ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని చెప్పారు.వాహనం నడిపే వాళ్ళు తప్పకుండా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.చిన్నపిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ జగదీష్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వైస్ సర్పంచి పత్తిపాక రమాదేవి, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు, టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular