Thursday, June 25, 2026
[t4b-ticker]

అంబేద్కర్ ఆశయాల సాధనే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళులు….

అంబేద్కర్ ఆశయాల సాధనే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళులు….

:మనం అనుభవించే రాజ్యాంగ ఫలాలు అంబేద్కర్ త్యాగాల తోనే…..

:సామాజిక ఉద్యమకారుడు బాబాసాహెబ్ అంబేద్కర్…

:కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట రత్నం బాబు…

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14(ప్రతినిధి మాత్రమే సురేష్ ): అంబేద్కర్ జయంతి వేడుకలలో
అంబేద్కర్ ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులు అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం మనం అనుభవించే రాజ్యాంగ ఫలాలు అంబేద్కర్ త్యాగం తోనే అని అంబేద్కర్ దేశానికి చేసిన సేవను స్మరించారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారని అంబేద్కర్ త్యాగాలను కొనియాడారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి, పలు వార్డుల కౌన్సిలర్లు, కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular