రక్తదానం మహా దానం
:అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది
:పిఐఎల్ గ్యాస్ పైప్ లైన్ ఇంచార్జ్ పివిఎస్ కిషోర్
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేసినట్లయితే మరి ఒకరి ప్రాణం కాపాడవచ్చు అని పిఐఎల్ గ్యాస్ పైప్ లైన్ ఇంచార్జ్ పివిఎస్ కిషోర్ అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన చెడపంగు జయరాజు హుజూర్ నగర్ నుండి సింగారం రోడ్డు మధ్యలో ద్విచక్ర వాహన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాలు విరగటంతో కోదాడ సురేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ నందు శుక్రవారం ఆపరేషన్ నిర్వహించటానికి అత్యవసరంగా ఏబి పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో పిఐఎల్ గ్యాస్ పైప్ లైన్ జనరల్ మేనేజర్ అబ్దుల్ ముజీబ్ జయరాజుకు బ్లడ్ ఇచ్చారు. జయరాజు కుటుంబం సభ్యుల తరఫున ప్రత్యేకమైన వారికి ధన్యవాదాలు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఐఎల్ గ్యాస్ పైప్ లైన్ ఇంచార్జ్ పివిఎస్ కిషోర్, లీడ్ మేనేజర్ కే శివ కుమార్, లెనిన్ కుమార్, కే రాజు బాబు, సాయి బాబా, తదితరులు జయరాజును పరామర్శించారు.



